రామ్ చరణ్ నటించిన రచ్చ చిత్రం బ్లాక్‌బస్టర్ రికార్డు సృష్టించి 14 ఏళ్లు అయింది. ఈ సందర్భంగా అప్పటి సెట్లో ఎన్.టి.ఆర్. పాల్గొన్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 2012 ఏప్రిల్ 5న విడుదలైన 'రచ్చ' ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొదటి రోజు మరియు మొదటి వారం రికార్డులను బద్దలు కొట్టింది. విడుదలైన మొదటి రోజే షేర్ల రూపంలో ₹8 కోట్లకు పైగా వసూలు చేసి, ఆ ప్రాంతంలో మొత్తం ₹35-47 కోట్ల వసూళ్లను రాబట్టింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఎటుచూసినా నున్నటి రోడ్లు కనబడుతున్నాయి. ఎలాంటి గతుకులు లేని రోడ్లపై వాహనదారులు హాయిగా వెళ్లిపోతున్నారు. ఐతే కొన్నిచోట్ల పంటికింద రాయిలా ట్రాఫిక్ కష్టాలను పలువురి నాయకుల విగ్రహాలు అడ్డుపడుతున్నాయి. కొన్ని కట్టడాలు కూడా ఇబ్బందులుపెడుతున్నాయి.
గత ప్రభుత్వ హయాంలో వైఎస్సార్ విగ్రహాలు చాలాచోట్ల ప్రతిష్టించారనీ, అవి ట్రాఫిక్ కష్టాలను కలిగిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. రోడ్డుకు అడ్డుగా వున్న విగ్రహాలను తొలగిస్తున్నారు. ఐతే పెందుర్తి, విశాఖ, ప్రకాశం వంటి ప్రాంతాల్లో వైఎస్సార్ విగ్రహాలు రోడ్డు విస్తరణ పనుల్లో అడ్డుగా వున్నాయనీ, వాటిని తొలగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.